అద్గదీ… ఐకమత్యం అంటే…

0
239

హైద‌రాబాద్ రేంజ్ 264 అధికారుల‌ విరాళం రూ. 3,43,055
వ‌రంగ‌ల్ రేంజ్ 96 అధికారుల విరాళం రూ. 1,31,500
విశాఖ రేంజ్ 83 అధికారులు రూ. 1,67,500
క‌ర్నూల్ రేంజ్ 4,51,000
ఏలూరు రేంజ్ 7,22,000.. మొత్తం రూ. 18,82,555..

ఏమిటీ లెక్కలు అని ఆశ్చర్యపోతున్నారా?? ఇవి ఐక్యమత్యం తాలూకా లెక్కలు… విధి నిర్వహణలో నిజాయితీగా పనిచేస్తూ ఒత్తిళ్లను తట్టుకోలేక అసువులుబాసిన ఓ యువ సబ్ ఇన్స్పెక్టర్ కు తామంతా వెనక ఉన్నామని నిరూపించే లెక్కలు… ఇద్దరు పిల్లలను ఎంత ఉన్నతంగా చదివించాలనే తపన పడ్డ ఓ పోలీసు అధికారికి తామంతా బాసటగా నిలుస్తామని తోటి స్నేహితులు అందించిన సాయపు తాలూక లెక్కలు…

అవినీతి ఒత్తిళ్ల‌తోనే మ‌ర‌ణం..

ఏలూరు రేంజ్ కు చెందిన యువ సబ్ ఇన్స్పెక్టర్ అల్లు దుర్గారావు ఇటీవల పలు కారణాలతో మృతిచెందారు. ఆయన మృతికి మొదట కరోనా అనుకున్న తర్వాత ఆయన మృతి లో పలు కోణాలు వెలుగుచూశాయి. ఉన్నతాధికారులు ఒత్తిళ్ళు.. రాజకీయ నేతల ప్రమేయం వల్ల దుర్గారావు పై విపరీతమైన ఒత్తిడి పెంచడం తోనే ఆయన మనోవేదనకు గురై కుంగి కృశించి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెప్పడం పోలీస్ శాఖలో పెను ప్రకంపనలు సృష్టించింది. అత్యంత నిజాయితీ గల అధికారి గా ఉన్న దుర్గారావు ను జంగారెడ్డిగూడెం ఎస్సైగా పనిచేస్తున్న సమయంలో అక్కడ పనిచేస్తున్న ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి పెట్టిన ఒత్తిళ్ల వల్ల ఆయన పై వేసిన అవినీతి మరకలు వల్ల దుర్గారావు ఎంతో మదన పడ్డారని అవి భరించలేకే మనోవేదనకు గురై మృతి చెందారని ఇప్పుడు పోలీస్ శాఖలో చర్చ జరుగుతోంది. సొంతూరిలో కనీసం సొంత ఇల్లు లేని దుర్గారావు నిజాయితీగా పనిచేస్తూ తణుకు, జంగారెడ్డిగూడెం, ఉంగుటూరు వంటి తేలిక స్టేషన్లో పని చేస్తూ తర్వాత విఆర్ కు, తర్వాత ఎస్ సి బి కు వెళ్లారు. జంగారెడ్డిగూడెం పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న సమయంలో ఇసుక మాఫియా మద్యం మాఫియా ఒత్తిళ్లలో సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆయనను తీవ్రమైన ఆవేదనకు గురి చేసి ఉన్నతాధికారులకు తప్పుడు రిపోర్టులు పంపారని తెలుస్తోంది. దీంతో అల్లు దుర్గారావు తీవ్ర మనోవేదన తో ఉద్యోగానికి సెలవు పెట్టి ఇంట్లోనే ఆవేదన చెందే వారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఆవేదన తోనే ఆయన మృతి చెందారని తమకు ఎవరు సమాధానం చెబుతారని వారి కుటుంబ సభ్యులు ప్రశ్నించడం పోలీస్ శాఖలో ఇప్పుడు సంచలనంగా మారింది.

అండ‌గా ఉంటామంటూ ప్ర‌తిన‌..

అయితే ఆయనకు తమ వంతు సాయంగా ఆయన 2009 బ్యాచ్ మెటులైనా తెలుగు రెండు రాష్ట్రాల్లోని ఎస్ఐ అంతా కలిపి తమ వంతు సాయంగా రూ. 18 లక్షలు సాయం అందించారు. ప్రభుత్వం అందించే సాయం తో నిమిత్తం లేకుండా దుర్గారావు కుటుంబానికి తామంతా అండగా నిలుస్తామని భవిష్యత్తులోనూ వారి పిల్లలను చక్కగా చూసుకుంటామని తోటి ఎస్ఐలు ప్రతిని బూనడం ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం. ఇలాంటి ఐక్యత కేవలం సమయంలోనే కాకుండా విధినిర్వహణలో ముక్కు సూటిగా ఉన్న సమయంలోనూ అంతా ఏకమై ఒత్తిడి తెచ్చి అధికారుల పట్ల తీవ్రంగా ఉంటే దుర్గారావు లాంటి మరణాలు మరిన్ని అడ్డుకోవచ్చు.

Leave a Reply