ఆన్‌లైన్‌లో వ్యభిచార దందా… సాగిస్తున్న నిర్వాహకుడు ఒకరు అరెస్టు… మరొకరు పరారీలో

0
149
Photo by Engin Akyurt on Pexels.com

హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ వ్యభిచార దందా నిర్వహిస్తున్న అంతరాష్ట్ర ముఠాను మల్కాజిగిరి ఎస్‌ఓటి పోలీసులు పట్టుకున్నారు. సమాచారం అందుకున్న ఎస్‌ఓటి పోలీసులు, స్థానిక నేరేడ్‌మెట్‌ పోలీసుల సాయంతో డెకాయ్‌ ఆపరేషన్‌ చేసి నిర్వాహకుడిని అదుపులోకి తీసుకోవడంతో పాటు ఇద్దరు బాధితు యువతులను రక్షించారు. చిన్నా అనే ప్రధాన నిర్వాహకుడు, దిల్‌సుక్‌నగర్‌కు చెందిన శివకుమార్‌తో కలిసి ఆన్‌లైన్‌లో వ్యభిచార దందా నిర్వహిస్తున్నాడు. ఉద్యోగాలిప్పిస్తామంటూ తప్పుడు వాగ్దానాలు చేసి వెస్ట్‌బెంగాల్‌, ముంబైతో పాటు ఇతర ప్రాంతాల నుంచి యువతులను రప్పించి ఇక్కడకు వచ్చిన తర్వాత మాయమాటలు చెప్పి… ఆరు నెలలు, ఏడాది పాటు ఒప్పందం కుదుర్చుకుని వ్యభిచార రొంపిలోకి దించుతున్నారు. ఆన్‌లైన్‌లో వారి ఫోటోలు పెట్టి కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. ఒక్కొక్కరి వద్ద నుంచి రూ. 5వేల నుంచి రూ. 8వేలు వసూలు చేస్తూ దందా సాగిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు డెకాయ్‌ ఆపరేషన్‌ ద్వారా నిందితుల్లో శివకుమార్‌ను పట్టుకోగా… చిన్నా పరారీలో ఉన్నాడు.

Leave a Reply