ఉత్తరప్రదేశ్ రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి

0
168

ఉత్తరప్రదేశ్ లో గురువారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు చిన్నారులు సహా 14 మంది మరణించారు. ప్రయాగ్ రాజ్ – లక్నో జాతీయ రహాదారిపై ప్రయాగ్ రాజ్ సమీపాన ఈ ప్రమాదం జరిగింది. కుండా నుంచి ప్రయాగ్ రాజ్ వైపు వెళ్తున్న ఓ బొలెరో వాహనం రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంతో బొలెరోలో ప్రయాణిస్తున్న 14 మంది అక్కడికక్కడే మరణించారు. బొలెరో నుజ్జునుజ్జుకావడంతో మృతదేహాలు బయటకు తీసేందుకు పోలీసులకు వెంటనే సాధ్యపడలేదు. దీంతో వాహన భాగాన్ని కొంతమేరకు కట్ చేసి మృతదేహాలను బయటకు తీశారు. మృతులు నబాబ్ గంజ్ ప్రాంతంలో ఓ వివాహ కార్యక్రమానికి హాజరై వస్తుండగా ఈ దారుణం జరిగినట్లు సమాచారం. ఈ ఘోర ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Leave a Reply