కన్నతండ్రే కామాంధుడైతే..

0
140

అతను పవిత్రమైన న్యాయవాద వృత్తిలో ఉన్నాడు. అయినా కామంతో కళ్లు మూసుకుపోయి వావివరసలు మరిచాడు. కన్న కూతురిపైనే పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. జన్మనిచ్చిన తండ్రే పశువుగా మారడంతో బలవన్మరణానికి యత్నించింది. తల్లి అడ్డుకుని నిలదీయడంతో ఆవేదన వెళ్లగక్కింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ దారుణం వివరాల్లోకి వెళ్తే.. హైదర్ షాకోట్ ఏరియా కపిల్ నగర్ కు చెందిన న్యాయవాది ఒకరు పదో తరగతి చదివే కన్నకూతురి పట్ల కీచకుడిగా మారాడు. బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ హేయచర్యలను భరించలేక బలవన్మణానికి యత్నించింది. అదే సమయానికి తల్లి అడ్డుకోవడంతో దారుణం గురించి కన్నీరు మున్నీరుగా విలపించింది. దీంతో నిర్ఘాంతపోయిన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ కామాందుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇది మరో దారుణం

ఉత్తరప్రదేశ్ లో మరో దారుణం వెలుగుచూసింది. ఓ ప్రభుత్యోద్యోగి అయిన ఓ జూనియర్ ఇంజినీరు పదేళ్లుగా 50 మంది బాలికలపై అత్యాచారానికి ఒడిగట్టిన వైనమది.  ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న రాంభవన్ అనే అతను చిత్రకూట్, హమీర్పూర్, బండా తదితర ప్రాంతాల్లోని నిరుపేద బాలికలను లక్షంగా చేసుకుని ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు చెబుతున్నారు. గతంలో అతనిపై లైంగిక ఆరోపణలు ఉన్నా తగిన సాక్ష్యాలు లేభించలేదు. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. మంగళవారం నిందితుడి నివాసంలో సోదాలు నిర్వహించగా భారీగా సీడీలు, మొబైల్ ఫోన్లు, కొంతమంది బాలికల ఫొటోలు బయటపడ్డాయి. దీంతో అతడిని అరెస్టు చేశారు.

Leave a Reply