కార్యాలయ భవనంపై నుంచి దూకి..

0
165

హైదరాబాద్; నగరంలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని తను పనిచేస్తున్న కార్యాలయ భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. నామాలగుండుకు చెందిన సుష్మిత టెక్ మహీంద్ర సంస్థలో పనిచేస్తున్నారు. సికింద్రాబాద్ గోపాలపురంలోని తన కార్యాలయానికి గురువారం విధులకు హాజరైన ఆమె అదే కార్యాలయ భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రేమ వ్యవహారమే బలవన్మరణానికి కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తెలిసినట్లు సమాచారం.

Leave a Reply