సవాల్‌గా మారిన బందోబస్తు.. అదను చూసి పారిపోతున్న నిందితులు

ఏలూరు : రిమాండ్‌లో ఉన్న ఖైదీలను కోర్టుకో, ఆసుపత్రుకో జాగ్రత్తగా తీసుకె|ళ్లి తేవడం అంటే సాధారణంగా పోలీసులకు సవాలే. ఇప్పడు వారికిది ప్రాణాలమీదికి తెస్తోంది. వందల సంఖ్యల్లో కిక్కిరిసిగా ఉండే జైళ్లలో ఈ మధ్య కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా అందరికీ వ్యాప్తి చెందే ప్రమాదం ఉండటంతో చిన్నపాటి లక్షణాలు బయటపడగానే వైద్యసేవల కోసం ఖైదీలను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఇది పోలీసుల ప్రాణాలమీదకు వస్తోంది. కరోనా లక్షణాలుండటంతో పోలీసులు వారి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ తీసుకెళ్తుండటంతో ఏమాత్రం అజాగ్తత్తగా ఉన్నా పరారైపోతున్నారు. ఇటీవలే వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్న ఓ నిందితుడిని అక్కడి ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లగా కరోనా వార్డులో అడ్మిట్ చేశారు. ఇతర రోగాలకు సాధారణ వార్డుల్లో చేర్పిస్తే అక్కడ కూడా పోలీసులు పక్కనే ఉంటారు. కరోనా వార్డు కావడంతో ఆసుపత్రి సిబ్బందిపై భారం వేసి బయట కాపలా కాస్తుండగా అడ్మిట్ చేసిన కాసేపటిటకే క్షణాల్లో పరారయ్యాడు. తాజాగా శనివారం (జులై-25) ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఇలాంటి ఓ సంఘటనలో ఇద్దరు ఖైదీలు పరారయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా జైలులో కరోనా లక్షణాలతో ఉన్నవారిని పరీక్షించగా 13 మందికి నిర్ధారణ అయింది. వీరిని ఏలూరులోని కోవిడ్ ఆసుపత్రిలో చేర్పించగా.. ఇద్దరు ఖైదీలు పరారయ్యారు. ఇలాంటి ఘటనలే ఉత్తరప్రదేశ్, బిహార్, ఢిల్లీలోనూ జరిగాయి. ఇంతవరకు ఖైదీల పరారీ పోలీసులకు, ఖైదీలకు సంబంధించిన విషయంగా ఉండగా.. కరోనా పాజిటివ్ కావడంతో ఈ సంఘటనలతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఖైదీలను పట్టుకుని వెళ్లాలంటే కరోనా భయం, సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ తీసుకెళ్తే పారిపోతే ఉద్యోగ భయం పట్టుకుందని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖైదీలను తీసుకెళ్లే డ్యూటీలంటేనే హడలిపోతున్నారు.