చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం..

0
158

హైదరాబాద్: చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్ పోసుకొని… నిప్పంటించుకుని, ఆత్మహత్య యత్నం చేసిన పాత నెరస్థుడు షబ్బీర్. అతన్ని కాపాడేందుకు చాంద్రాయణగుట్ట అదనపు సిఐ ప్రసాద్ వర్మ తోటి సిబ్బంది ప్రయత్నించినా షబ్బీర్ గాయాల పాలయ్యాడు. కాపాడే యత్నంలో క్రైమ్ డి ఐ ప్రసాద్ వర్మ తో పాటు మరో కానిస్టేబుల్ కి స్వల్ప గాయాలు. ఈ ఘటన పోలీస్ స్టేషన్ ముందు జూలై 20న రాత్రి 9 గంటలకు చోటు చేసుకుంది. కాలిన గాయాలతో ఉన్న నెరస్థుడు షబ్బీర్ ని చాంద్రాయణగుట్ట పోలీసులు ఆస్పత్రికి తరలించారు. షబ్బీర్ గతం లో 4 కేసుల పై శిక్ష అనుభవించి ఉన్నాడు. తాజాగా ఓ చోరీ కేసు విచారణ నిమిత్తం అతన్ని చాంద్రాయణగుట్ట పోలీసులు పిలిపించారు. అదే సమయంలో షబ్బీర్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడటం గమనార్హం.

Leave a Reply