ప్రియురాలిని కలిసేందుకు సరిహద్దు  దాటే ప్రయత్నం… అంతలోనే…..

0
114


సోషల్ మీడియాలో పరిచయమైన
స్నేహితురాలిని కలవాలని పాకిస్తాన్ లోకి చొరబడేందుకు
యత్నించాడు ఓ యువకుడు. కాలినడకన సరిహద్దు దాటు
తున్న అతడిని గుజరాత్ లోని రాణ్ ఆఫ్ కచ్ వద్ద సరిహద్దు
భద్రతా దళం(బీఎస్ఎఫ్) అడ్డుకుంది. మహారాష్ట్రలోని ఉస్మా
నాబాద్ కు చెందిన జీషాన్ సిద్దిఖీ  ఇంజినీరింగ్ విద్యార్థి.
సోషల్ మీడియాలో పరిచయమైన పాకిస్తాన్‌కు చెందిన
మహిళను కలిసేందుకు అతడు బైక్ పై బయలుదేరాడు.
జూలై 16 సాయంత్రం గుజరాత్ లోని దోలావిరా గ్రామ
సమీపంలో బైక్ ఇసుకలో దిగబడటంతో దానిని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు.  అంతలోనే మహారాష్ట్ర నెంబర్
ప్లేట్ తో ఉన్న బైక్ ను గుర్తించిన బీఎస్ఎఫ్ అప్రమత్తమైంది.
రాత్రి  వేళ సరిహద్దు
దాటుతున్న సిద్దిఖీని జవాన్లు
పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు.

Leave a Reply