మత్తు కోసం శానిటైజర్లు… తాగి 16 మంది మృతి

0
98

కురిచేడు: కురిచేడులో మద్యం.. కోసం కోసం శానిటైజర్లు సేవించి 19 గంటల వ్యవధిలో 12 మంది మృత్యువాత పడ్డారు. అలాగే పామూరులో వారం వ్యవధిలో ముగ్గురు, గుంటూరులో మరొకరు మృత్యువాత పడ్డారు. వారం రోజుల వ్యవధిలో మొత్తం 16 మంది మృతి చెందారు. ముందు జాగ్రత్త చర్యగా ఆయా ప్రాంతాల్లో మెడికల్‌ షాపులు సీజ్‌ చేసి… సేకరించిన శాంపిళ్లను ల్యాబ్‌కు తరలించారు. ఘటనపై ఆంధ్ర ప్రదేశ్ సీఎం, డీజీపీ ఆరా తీస్తున్నారు. ఘటనపై ప్రత్యేక బృందంతో విచారణ జరిపిస్తున్న ట్లు ఎస్పీ తెలిపారు.

వివరాల్లోకి వెళితే….
మత్తు కోసం శానిటైజర్‌ తాగి 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఈ దారుణం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా కురిచేడు మండల కేంద్రంలో 19 గంటల వ్యవధిలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, పామూరు గ్రామంలో వారం వ్యవధిలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. కురిచేడులో పెళ్లికి హాజరైన గుంటూరు వాసి కూడా శానిటైజర్‌ తాగి ప్రాణాలు కోల్పోయారు. కురిచేడులో కరోనా కేసులు ఎక్కువగా వెలుగు చూస్తుండటంతో గ్రామాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. మద్యం దుకాణాలను మూసివేశారు. దీనికితోడు మద్యం ధరలు అధికంగా ఉండటంతో మత్తుకు బానిసైన కూలీలు శానిటైజర్‌ తాగడానికి అలవాటు పడ్డారు. పది రోజులుగా శానిటైజర్‌ సేవిస్తున్నారు. జూలై 30, గురువారం సాయంత్రం 6.30 గంటల నుంచి ఒక్కొక్కరుగా ప్రాణాలు వదలడం ప్రారంభమైంది. శుక్రవారం జులై 31 మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఈ మరణాల పరంపర కొనసాగింది. మృతుల్లో ఐదుగురు కూలీలు, ఇద్దరు ఆటో డ్రైవర్లు, ఒక రైతు, ఇద్దరు యాచకులు, ఒకరు చిత్తు కాగితాలు ఏరుకునే వ్యక్తి ఉన్నారు. వీరంతా ఎవ‌రికివారే శానిటైజర్‌లో నీళ్లు కలుపుకొని తాగారు. మద్యం బాటిళ్లలో ఆల్కహాల్‌ 40 శాతం మాత్రమే ఉంటుంది. శానిటైజర్లలో మాత్రం 70శాతం ఉంటుంది. దీంతో రూ.50కు దొరికే 100 ఎంఎల్‌ శానిటైజర్‌ బాటిల్‌ను కొనుగోలు చేసి నీళ్లలో కలుపుకొని తాగడం ప్రారంభించడం తోనే ఈ మరణాలు సంభవించినట్లు అధికారులు భావిస్తున్నారు.

కురిచేడు మృతులు వీరే..
ఆటోడ్రైవర్‌ కడియం రమణయ్య(28), యాచకుడు కొనగిరి రమణయ్య(45), విశ్రాంత లస్కర్‌ పాలెపోగు దాసు(65), చిత్తు కాగితాలు ఏరుకునే కొనగిరి బాబు(35), కుందా అగస్టీన్‌(42) గురువారం రాత్రి మరణించారు. కొనగిరి బాబు, కడియం రమణయ్యలను 108లో దర్శి సీహెచ్‌సీకి తీసుకెళ్లగా అక్కడ మృతిచెందారు. కొనగిరి రమణయ్య, దాసు, అగస్టీన్‌ ఇంటి వద్దనే ప్రాణాలు విడిచారు. శుక్రవారం అనుగొండ శ్రీను (29) భోగ్యం తిరుపతయ్య(35), గుంటక రామిరెడ్డి(57), కంభంపాటి దాసు ఇంటి వద్ద మృతిచెందగా, మాడుగుల చార్లెస్‌(36) కురిచేడులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో, రాజారెడ్డి(65) రోడ్డు పక్కన చెట్టు కింద షేక్‌ సైదా(29) వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో మృతిచెందారు. వారు తాగిన శానిటైజర్లు కల్తీవని స్థానికులు, అధికారులు అనుమానిస్తున్నారు.

మనవరాలి పెళ్లికొచ్చి..
గుంటూరుకు చెందిన మాతంగి పెద్ద సుబ్బారావు(60) కురిచేడులో జూలై 29న మనుమరాలి పెళ్లికి హాజరయ్యారు. 30న ఆయన కూడా శానిటైజర్‌ తాగారు. రాత్రికి ఆయాసం ఎక్కువవడంతో గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. ఆయాసం ఎక్కువై శుక్రవారం తెల్లవారుజామున ఆయన మృతి చెందారు.

Leave a Reply