రియా చ‌క్ర‌వ‌ర్తి కోసం గాలిస్తున్నాం : బిహార్ డీజీపీ

0
114
Rhea chakraborty

పాట్నా : బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ ఆత్మ‌హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితురాలిగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న అత‌డి ప్రియురాలు రియా చ‌క్ర‌వ‌ర్తి క‌నిపించ‌డం లేద‌ని బిహార్ డీజీపీ గుప్తేశ్వ‌ర్ పాండే తెలిపారు. ఆమె కోసం ప్ర‌త్యేక పోలీసు బృందాలను నియ‌మించామ‌ని, న‌లుగురు స‌భ్యుల‌తో కూడిన బృందం ముంబైకి పంపామ‌ని ఆయ‌న శ‌నివారం (ఆగ‌స్టు-1) పేర్కొన్నారు. బిహార్ రాష్ట్రం పాట్నాకు చెందిన సుశాంత్ జూన్-14న ముంబైలోని త‌న నివాసంలో ఆత్మ‌హ‌త్య చేసుకోగా.. ఆయ‌న తండ్రి కేకే.సింగ్ జులై-25న పాట్నాలోని రాజీవ్ న‌గ‌ర్ పోలీస్టేష‌న్లో ఫిర్యాదు చేశారు. ఇందులో రియా చ‌క్ర‌వ‌ర్తి ప్ర‌ధాన నిందితురాలిగా, ఆమె కుటుంబ‌స‌భ్యులతో క‌లిపి మొత్తం ఆరుగురి పేర్ల‌ను ఆయ‌న త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. సుశాంత్ హ‌త్య‌కు గుర‌య్యాడంటూ బీజేపీ సీనియ‌ర్ నేత సుబ్ర‌మ‌ణ్య‌స్వామితో ప‌లువురు ప్ర‌ముఖులు ఆరోపించ‌డంతోపాటు ప‌లు ఆధారాలు కూడా పేర్కొంటున్నారు. దీంతో ఈ కేసు రోజురోజుకో కొత్త మ‌లుపులు తిరుగుతోంది. కాగా అజ్ఞాతంలోనే ఉంటున్న రియా చ‌క్ర‌వ‌ర్తి కేసును పాట్నా నుంచి ముంబైకి బ‌దిలీ చేయాల‌ని సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌గా.. దీనిపై ఆగ‌స్టు-15న నిర్ణ‌యం వెలువ‌డ‌నుంది.

Leave a Reply