రౌడీ షీటర్లకు బంపర్ ఆఫర్

0
138
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్


హైదరాబాద్:  ఏళ్ల తరబడి రౌడీ షీటర్లుగా  ఉండి కొన్నేళ్లుగా సత్ప్రవర్తన కలిగిన వారికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ బంపర్ ఆఫర్ ఇచ్చారు.  కొన్నేళ్లుగా ఎలాంటి నేరాలకు పాల్పడని  వారిపైనుంచి  రౌడీ షీట్ ను తొలగించే ప్రక్రియ ప్రారంభించారు.  కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉంటూ…  ఇకముందు  కూడా ఎలాంటి నేరాలకు పాల్పడకుండా  అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్  పరిధిలో ఉన్న  ఉత్తర,  దక్షిణ,  తూర్పు, పశ్చిమ, సెంట్రల్  జోన్లలో  ఇప్పటికే సత్ప్రవర్తన కలిగిన కొంతమంది రౌడీషీటర్లను గుర్తించే కసరత్తు ప్రారంభమైంది.  శుక్రవారం (జులై-31) నుంచి సౌత్ జోన్ లో  కొంతమంది రౌడీషీటర్ల  షీట్లను  తొలగించ‌నున్నారు.  మరోవైపు కొంతకాలంగా తరచూ ఏదో రకంగా నేరాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి వారిపై కొత్త  రౌడీషీట్లు కూడా  తెరిచే అవకాశం ఉందని  అంజనీ కుమార్ హెచ్చరించారు.

Leave a Reply