
ఆత్మరక్షణ కోసం ఇచ్చిన గన్ లైసెన్సును దుర్వినియోగం చేస్తే క్షణాల్లో ఆ లైసెన్సు రద్దు చేయడమే కాకుండా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. వివిధ అంశాల్లో దర్యాప్తు జరిపిన తర్వాతనే ఆయుధాల లైసెన్సు మంజూరు అవుతుంది. అలాంటి కీలకమైన లైసెన్సును… వాడే ఆయుధాన్ని దుర్వినియోగం చేయరాదని ఆయన సూచించారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా…. తుపాకీతో విన్యాసాలు చేసినా… ఆయుధాలతో బెదిరించినా వెంటనే 9490616555 వాట్సాప్ నెంబర్‌పై సమాచారం ఇవ్వాలని కోరారు.