హైదరాబాద్‌లో కొకైన్‌ దందానైజీరియన్‌ జంట నుంచి 104గ్రా. కొకైన్‌ స్వాధీనం

0
126


నైజీరియాకు చెందిన జంట తార్నాకలో నాలుగు రోజుల క్రితం ఓ ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. యువకుడు ఇక్కడే ఉంటుండగా… ముంబై నుంచి నగరానికి ఆ యువతి కొకైన్‌ తీసుకొచ్చి యువకునితో పాటు ఉంటోంది. హైదరాబాద్‌లోని తార్నాక, గచ్చిబౌలి, సికింద్రాబాద్‌, ఇతర ప్రాంతాల్లో కస్టమర్లకు రూ. 8వేలకు గ్రాము చొప్పున విక్రయిస్తున్నారు. కొకైన్‌ దందా ఆనవాళ్లు మళ్లీ నగరంలో కనిపిస్తున్నాయన్న సమాచారం అందుకున్న అధికారులు ఆదివారం తార్నాక వద్ద ఓ యమహా ఎఫ్‌జడ్‌ బైక్‌పై వెళ్తున్న నైజీరియన్‌ జంటను అడ్డుకున్నారు. వారి నుంచి 104గ్రాముల కొకైన్‌, ఊ. 1.64లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకుని విచారించగా నైజీరియాకు చెందిన జైదీపాస్కల్‌ తన గర్ల్‌ఫ్రెండ్‌, నైజీరియా వాస్తవ్యురాలు చుక్వుడి ఎబెరె మోనిక తో కలిసి తార్నాకలో నివసిస్తూ దందా చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు.

Leave a Reply