అత్యాచారానికి పదేళ్ల జైలు

0
178

సికింద్రాబాద్: 8 ఏళ్ల క్రితం ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడి కి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. వాస్తు నిపుణుడిగా  చలామణి అవుతూ..   సివిల్ కాంట్రాక్టర్ గా  వ్యాపారం చేసుకునే గట్టు రాజేందర్ కు పదేళ్ల జైలు శిక్ష.. లక్ష రూపాయల జరిమానా విధిస్తూ నాంపల్లి కోర్టు  తీర్పునిచ్చింది. న్యూ బోయినపల్లి కి చెందిన రాజేందర్ 2012లో మహిళ పై అత్యాచారానికి పాల్పడ్డాడు… అప్పట్లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన బోయినపల్లీ పోలీసులు న్యాయస్థానం లో ఛార్జ్ షీటు దాఖలు చేశారు. విచారణ అనంతరం ఎంఎస్ జె నాంపల్లి కోర్టు న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు.  నేరస్థుడికి పదేళ్ల జైలు శిక్ష విధించడంపై కోర్టు తీర్పును హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ స్వాగతించారు.  దర్యాప్తు చేసి నిందితుడికి శిక్ష పడేలా ఆధారాలు సేకరించిన పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు.

Leave a Reply