పబ్ లో పదేళ్ళ బాలిక?

0
221

హైదరాబాదు: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఓ పబ్ లోకి పదేళ్ల బాలికను అనుమతించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో గచ్చిబౌలి పోలీసులు స్పందించారు. పబ్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. గచ్చిబౌలిలోని లాల్ స్ట్రీట్ పబ్ లోకి ఓ కుటుంబం పదేళ్ల బాలికను కూడా తీసుకువచ్చింది. అయితే ఓ యువకుడు పబ్ లో బాలిక ఉన్న విషయాన్ని వీడియో తీసి పోలీసు కమిషనర్ కు ట్వీట్ చేశాడు. దాంతో విషయం వెలుగులోకి వచ్చింది. మైనర్ లను పబ్ లోకి అనుమతించరాదన్న నిబంధనను పబ్ యాజమాన్యం ఉల్లంఘించినట్టు తాజా ఘటనతో వెల్లడైంది. దీనిపై వివరణ కోరుతూ పబ్ మేనేజర్ కు, యాజమాన్యానికి పోలీసులు నోటీసులు పంపారు.

Leave a Reply