నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేస్తే  అరెస్టే

0
182

File photo

హైదరాబాద్:  కొంతమంది వాహనదారులు నెంబర్ ప్లేట్లను  ట్యాంపరింగ్ చేయడం…  నెంబర్ కనిపించకుండా ఏదో రకంగా జాగ్రత్త పడుతుంటారు.  ఇలాంటి చర్య నేరస్తులకు,   చైన్ స్నాచర్లకు,  నేరాలు చేసి  పారిపోయే వారికి అవకాశంగా మారుతుంది.  ఇలాంటి వారిపై నిఘా పెట్టి..   చర్యలు తీసుకోవడానికి హైదరాబాద్ పోలీసులు సిద్ధమయ్యారు. నెంబర్ ప్లేట్లను ట్యాంపరింగ్ చేయడం కూడా   నేరమేనని..  అలాంటివారిపై  ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి అరెస్టు చేస్తామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.

అల‌ర్ట్ : ఒక నెంబ‌ర్ చెరిగిపోవ‌డం, చిన్న‌పాటి ప్ర‌మాదాల్లో నేమ్ ప్లేట్ వంక‌ర‌గా ఉండ‌టం లాంటి త‌ప్పిదాలు మ‌న వాహ‌నాల‌లో కూడా ఉండ‌వచ్చు. వాహ‌నం బ‌య‌టికి తెచ్చేముందు వీటిని ఒక‌టికి రెండుసార్లు జాగ్ర‌త్త‌గా చూసుకోండి. లేదంటే మీరు కావాల‌ని త‌ప్పు చేయ‌క‌పోయినా.. చెల్లించాల్సి రావ‌చ్చు భారీ మూల్యం.

Leave a Reply