నేరాల్లో ‌హాఫ్ సెంచరీ…  హైదరాబాద్ లో  చిక్కిన స్నాచర్…

0
439

మీడియా సమావేశం

హైదరాబాద్:  మహారాష్ట్ర లాతూర్ జిల్లా కు చెందిన శంకర్రావు  బిరాదర్ (36)  బైకు చోరీలు,  చైన్ స్నాచింగ్ లలో అర్థ సెంచరీ పూర్తి చేశాడు.  మహారాష్ట్రలోని 20 పోలీస్ స్టేషన్లలో అతనిపై 47 కేసులుండ‌గా హైద‌రాబాద్లో ప‌లుచోట్ల మ‌రో 3 ఉన్నాయి. చివరిసారిగా పూణే సమీపంలోని హడాప్సర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులో అరెస్టై ఎరవాడ జైలులో శిక్ష అనుభవించాడు.  ఈ ఏడాది జూన్  చివరి వారంలో  జైలు నుంచి విడుదలై  హైదరాబాద్ ను టార్గెట్ చేసుకున్నాడు.  జులై-1 న  హైదరాబాద్ చేరుకుని బిరాదర్ ఇక్కడ రెక్కీ నిర్వహించాడు.  తొలుత బైకు చోరీ చేయడం ఆ తర్వాత చోరీ చేసిన బైకుపై స్నాచింగ్ చేయడం  ఇతని హాబీ.  మహారాష్ట్రలో 33 స్నాచింగ్ లు, 14 బైకు చోరీ ల్లో  నిందితుడిగా ఉన్నాడు. హైదరాబాదులో జులై -19న గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో పల్సర్ బైకు చోరీ చేశాడు.  అదే బైకుపై కాచిగూడ,  ఎస్సార్ నగర్  పోలీస్ స్టేషన్ల పరిధిలో రెండు స్నాచింగ్ లు చేశాడు.  వరస స్నాచింగ్ లతో  అప్రమత్తమైన పోలీసులు అతని పై నిఘా పెట్టారు. స్నాచింగులు  జరిగిన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు జల్లెడపట్టి ఎట్ట‌కేల‌కు నిందితుడిని గుర్తించారు. జులై-30 న పట్టుకున్నారు.  అతని వద్ద నుంచి చోరీ సొత్తును, బైకును  రికవరీ చేశారు.  పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ గురువారం వివరాలు వెల్లడించారు.

Leave a Reply