కౌన్సెలర్ ఇంట్లో చోరీ

0
238

కామారెడ్డి: జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పడుతున్నాయారు. వరస చోరీలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. మంగళవారం కామారెడ్డి పురపాలక సంఘం కౌన్సిలర్ వనిత రామ్మోహన్ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. కామారెడ్డి జిల్లా ఎస్పి క్యాంప్ ఆఫీస్ కు కూతవేటు దూరంలో ఈ చోరీ ఘటన జరిగింది. జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీ లోని 15వ వార్డ్ కౌన్సిలర్ వనిత రామ్మోహన్ ఇంట్లో భారీ చోరీ జరిగిన ఘటన చోటు చేసుకుంది. ఇంటికి తాళం వేసి ఉండటంతో తాళాలు పగులగొట్టి ఇంట్లోకి దుండగులు చొరబడ్డారు. ఇంట్లో ఉన్న 50 తులాల బంగారం, 60 తులాల వెండి తో పాటు కొంత నగదును దోచుకెళ్లారు. ఈ మేరకు కామారెడ్డి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం బృందం సంఘటన స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. బాధితుల కథనం ప్రకారం…. కౌన్సిలర్ వనిత రామ్మోహన్ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి అశోక్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. రామ్మోహన్ సోదరుడు శ్రీనివాస్ కూమార్తె వివాహం ఈ నెల 24 వ తేదీన కామారెడ్డి లో జరిగింది. ఈ వివాహ వేడుకలకు బంధువులు అందరూ హాజరయ్యారు. మరుసటి రోజు కౌన్సిలర్ వనిత భర్త రామ్మోహన్ తండ్రి లక్ష్మి రాజాం మృతి చెందారు. దీంతో వివాహానికి సంబందించిన బంగారంతో పాటు బంధువుల బంగారాన్ని కొన్సిలర్ వనిత రామ్మోహన్ ఇంట్లో ఉంచి తండ్రి లక్ష్మీ రాజాం అంత్యక్రియలకు మాచారెడ్డి మండలం గజ్జయనాయక్ తండకు వెళ్లారు. మంగళవారం తెల్లవారు జామున గుర్తు తెలియని దొంగలు కౌన్సిలర్ వనిత రామ్మోహన్ ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లో ఉన్న బంగారం, వెండి తో పాటు నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. కౌన్సిలర్ వనిత రామ్మోహన్ బంధువులు మంగళవారం ఉదయం ఇంట్లోకి వచ్చి చూడగా ఇంటి తాళాలు పగులగొట్టి ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కామారెడ్డి ఇన్చార్జ్ డిఎస్పీ శశాంక్ రెడ్డి. కామారెడ్డి పట్టణ సిఐ మధుసూదన్, ఎస్సై రవి కుమార్, పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇంటి ముందర బిగించిన సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply