జూదంలో భార్యను ఓడిన ప్రబుద్ధుడు

0
499

గెలిచిన వారి చేతిలో లైంగిక దాడికి గురైన అభాగ్యురాలు
ఆగ్రహంతో ఆమెపై యాసిడ్ పోసి గాయపరిచిన భర్త

మహాభారతంలో ధర్మరాజు తన భార్య ద్రౌపదిని కౌరవులతో ఆడిన జూదంలో ఓడిపోవడం… తర్వాత నిండుసభలో ఆమెకు వవస్త్రాపహరణ అవమానం మనందరికీ తెలిసిన కథే. సరిగ్గా అలాంటిదే బిహార్లో పునరావృతమైంది. వ్యసనపరుడైన ఓ భర్త అయిదుగురు వ్యక్తులతో జూదం ఆడి… పందెంగా తన భార్యను ఒడ్డి ఓడిపోయాడు. ఫలితంగా ఆ అయిదుగురు ఇంటిలో ఉన్న అతడి భార్యపై సామూహికంగా అత్యాచారం చేశారు. ఆ దీనురాలి వేదన అంతటితో ముగియలేదు. స్నేహితుల‌కు స‌హ‌క‌రించ‌డం లేద‌న్న కోపంతో ఆగ్రహించిన భర్త ఆమెపై యాసిడ్ తో దాడి చేసి గాయపరిచాడు. భాగల్పూరులోని మొజాహిద్ పూర్ లోని ఓ ప్రాంతంలో నవంబరులో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు భర్త ఇంటి నుంచి తల్లితండ్రుల వద్దకు పారిపోయి వారి సహాయంతో డిసెంబరు 11న పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు చురుగ్గా దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలి దీనగాథ నిజమేనని వారి విచారణలో తేలింది. ‘‘వాళ్లు నా కళ్లకు గంతలు కట్టి అత్యాచారం చేసినందున వాళ్లెవరో నేను గుర్తు పట్టలేను. నా భర్తతో నాకు పదేళ్ల కిందట పెళ్లయ్యింది. పిల్లలు పుట్టలేదన్న కారణంతో ఆయన నన్ను చాలా కాలంగా వేధిస్తున్నాడు’’ అని ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసు దర్యాప్తు వేగంగా పూర్తి చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు.

Leave a Reply