మేము…

నేరం.. ఈ ప‌దం ప్ర‌తిరోజు వార్తా ప‌త్రిక‌లు, టీవీ ఛానళ్ల‌లో ప్ర‌ముఖ‌‌మైపోయింది. నేర‌ వార్త‌లు సమాజంలో నిత్యకృత్యమైపోయాయి.. మన చుట్టూ జరిగే నేరాలు, ఘోరాల గురించి తెలుసుకోవడం సామాజిక అప్రమత్తతకు దోహదపడుతుంది. మోసాల‌మ‌య‌మైన ఈ ప్ర‌పంచంలో మ‌న‌ల్ని మ‌నం ర‌క్షించుకునేందుకు ఆ సమాచారం ఉపకరిస్తుంది. ఈ దిశ‌గా ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేయడమే మా ‘నేరాలు ఘోరాలు.కామ్’ వెబ్ సైట్ ఉద్దేశం.

క్ష‌ణికావేశంలో చేసిన త‌ప్పిదంతో నేర‌స్తుడు జైల్లో శిక్ష అనుభ‌విస్తే.. అత‌డిపై ఆధార‌ప‌డ్డ వారంతా స‌మాజంలో శిక్ష అనుభ‌విస్తారు. అతడి జీవితం మరొకరికి గుణ‌పాఠం కావాలని… నేరరహిత ఆలోచన ధోరణి పెరగాలన్నదే మా ల‌క్ష్యం. నేర‌ర‌హిత స‌మాజం మా ఆశ‌యం. దీనికోస‌మే పాత్రికేయ రంగంలో విశేష అనుభ‌వమున్న సీనియ‌ర్ పాత్రికేయులు క‌లిసి ఏర్పాటు చేసిందే ఈ వెబ్ సైట్. అనేక ప‌త్రిక‌లు, టీవీ ఛాన‌ళ్లు, లెక్కలేన‌న్ని వెబ్‌సైట్లు, యూట్యూబ్ ఛాన‌ళ్లు వార్త‌ల‌ను ఇస్తూ.. అందులో నేర సంబంధిత వార్త‌ల‌ను కూడా ఒక భాగంగా అందిస్తున్నాయి. కానీ కేవ‌లం నేర సంబంధిత వార్త‌లు, విశ్లేష‌ణ‌ల‌ కోసమే ప్రారంభిస్తున్న తొలి క్రైం న్యూస్ వెబ్‌సైట్ తెలుగు రాష్ట్రాల‌లో ఇదే ప్ర‌థ‌మం అని చెప్పడానికి గ‌ర్వ‌ప‌డుతున్నాం. ఈ వెబ్‌సైట్ ద్వారా మేము అనుకున్న ల‌క్ష్యాల‌ను సాధిస్తామ‌ని, నేరమ‌య‌మైన‌ స‌మాజంలో ఓ మార్పున‌కు కార‌ణ‌మ‌వుతామ‌న్న ఆత్మ‌విశ్వాసంతో ముంద‌డుగు వేస్తున్నాం. మా సుదీర్ఘ పాత్రికేయ అనుభ‌వం, వాస్త‌విక విశ్లేష‌ణ‌లు, సంచ‌ల‌నం కోసం కాకుండా నిజాల‌ను వెలికి తీసేందుకు సాగే ప‌రిశోధ‌న‌‌లు అంద‌రినీ ఆక‌ట్టుకుంటాయ‌ని న‌మ్ముతున్నాం.

పాఠ‌కులు త‌మ అభిప్రాయాలు, నేర‌ర‌హిత స‌మాజానికి దోహ‌ద‌ప‌డే సల‌హాల‌ను neralughoralu@yahoo.com ద్వారా తెలుప‌వ‌చ్చు.

జై హింద్