హైదరాబాద్: కూతురు పెళ్లి జరిపిన వారం రోజుల వ్యవధిలో వారి ఇంట్లో విశాద చాయలు అలుముకున్నాయి. పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంపీటీసీ దంపతులు మృతి చెందారు. ప్రమాదంలో నల్గొండ జిల్లా తిపర్తి మండలం దుప్పల పల్లి ఎంపీటీసీ దంపతులు వేణుగోపాల్ రెడ్డి, కవిత (టి.ఆర్.ఎస్ ఎంపీటీసీ)లు ప్రాణాలు కోల్పోయారు.
గత నెల 22వ తేదీన తమ కూతురు వివాహం వేడుకలు జరుపుకొని పనులు ముగిశాక అనంతరం వనస్థలిపురం లోని సహారా స్టేట్స్ లోని తమ నివాసానికి కి వస్తుండగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం
రాత్రి పెద్ద మంగళవారం అంబర్ పేట్ వద్ద కు రాగానే డివైడర్ వద్ద టిప్పర్ మూల మలుపు తీసుకొంటుండగా వేణుగోపాల్ దంపతుల స్కార్పియో వాహనం టిప్పర్ కి వెనుకాల నుండి వేగంగా ఢీకొనడంతో దంపతులు ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. ప్రమాదానికి కారకుడైన టిప్పర్ డ్రైవర్ సారి లో ఉన్నాడు.