ఆధార్ నెంబర్.. వేలి ముద్రల ఫోటో తో కొత్త మోసం

0
232

హైదరాబాద్: ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిదిలో వెలుగు చూసిన కొత్త రకం చోరీ మరో సైబర్ నేరాన్ని ఎత్తి చూపుతోంది. ఓ వ్యక్తి ఖాతాలోంచి నగదు మాయం కావడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు కొత్త మోసాన్ని వెలుగులో తెచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రెవెన్యూ వెబ్ సైట్ నుంచి భూముల దస్తావేజులు డౌన్ లోడ్ చేసిన ఇద్దరు యువకులు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి వారిని అదుపులో తీసుకున్నారు. దస్తావేజుల్లో ఉన్న ఆధార్ కార్డు, వేలి ముద్రల ఫోటోలకు తమ తెలివి జోడించి బ్యాంకు అకౌంట్ నుంచి నగదు స్వాహా చేశారు.

తనకు తెలియకుండా తన ఖాతాలో నుంచి రూ10000 కాజేశారని మధురా నగర్ కాలనీ కి చెందిన సిద్ధి రెడ్డి వీర వెంకట సత్యనారాయణ మూర్తి ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎక్కడి నుంచి డబ్బులు తస్కరించారో దర్యాప్తు చేసి ఆ కోణంలో పోలీసులు విచారించారు. సీ ఏ చదివిన ఇద్దరు విద్యార్థులు ఈ డబ్బు తస్కరించారని గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా.. కేవలం ఆధార్ కార్డు, వేలి ముద్రల ఫోటో.. నీటి చుక్కల సాయంతో పేపాయింట్ ద్వారా డబ్బు తస్కరించినట్టు నిందితులు వెల్లడించారు. నిందితులు విశాల్, అర్షద్ సీఏ విద్యార్థులుగా గుర్తించిన పోలీసులు వారి నేర చరిత్ర గురించి ఆరా తీస్తున్నారు.

Leave a Reply