
సింగపూర్: రాజ్యసభ సభ్యుడు, సమాజ్ వాదీ పార్టీ మాజీనేత అమర్ సింగ్(64) సింగపూర్ లో కన్ను మూశారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో ఉన్న అమర్ సింగ్ ఈ ఏడాది మార్చి నెలలో చికిత్స నిమిత్తం సింగపూర్ వెళ్లారు. అక్కడే ఆగస్టు 1న తుది శ్వాస విడిచారు. ములాయం సింగ్ యాదవ్ హయాంలో సమాజ్ వాది పార్టీలో కీలక నేతగా ఉన్న ఆయన పలు సందర్భాల్లో… పార్టీకి సంబంధించిన కీలక తరుణంలో సందర్భోచిత నిర్ణయాలు తీసుకుని తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. 2008లో యూపీఏ ప్రభుత్వం సంక్షోభంలో పడినప్పుడు సమాజ్ వాది పార్టీ మద్దతు ప్రకటించడంలో అమర్ సింగ్ కీలకంగా వ్యవహరించారు. అమర్చి మృతిపట్ల ప్రధాని మోడీ తో పాటు పలువురు రాజకీయ నేతలు సంతాపం ప్రకటించారు. కొన్ని దశాబ్దాలుగా శక్తివంత నాయకుడిగా ఉన్న అమర్ సింగ్ ను దేశం కోల్పోయిందని ప్రధాని ట్వీట్ చేశారు.
