
హైదరాబాద్: రాచకొండ, కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. సైనిక్ పురిలో నివాసముండే దంపతులు తమ కొడుకు పెళ్లి నిమిత్తం ఫలక్ నుమా ప్యాలెస్ లో జరిగిన రిసెప్షన్ కు వెళ్లి వచ్చేసరికి ఇంట్లో చోరీ జరిగినట్టు గ్రహించారు. వారింట్లో కొన్ని రోజులుగా నేపాల్ కు చెందిన భీమ్ అనే వ్యక్తి వాచ్ మాన్ గా పని చేస్తున్నాడు . ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు నగదును ఎత్తుకెళ్లినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చోరీకి గురైన సొత్తు విలువ సుమారుగా కోటి రూపాయలు ఉంటుందని బాధితులు చెబుతున్నారు. చోరీకి గురైన వస్తువుల్లో కిలో బంగారం తో పాటుగా కొన్ని ఖరీదైన వస్తువులు ఉండే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.