ఆస్తి కోసం అన్న తో సహా ముగ్గురి హత్య

0
272

వరంగల్: వరంగల్ ఎల్బీనగర్ లో దారుణం  చోటు చేసుకుంది.   ఆస్తి వివాదాల నేపథ్యంలో
అన్న కుటుంబం పైనే తమ్ముడు. అతని అనుచరులు కత్తులతో దాడి  చేయడంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. దాడిలో గాయపడ్డ అన్న సహా ముగ్గురు మృతి  చెందగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.  కొన్నేళ్ల నుంచి ఆయా కుటుంబాల మధ్య
ఆస్తి తగాదాల నేపథ్యంలోనే దాడిచేసినట్టు అనుమానాలు  వ్యక్తమవుతున్నాయి. దాడికి పాల్పడింది  మృతుడి తమ్ముడు అతని అనుచరులని  స్థానికులు  పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం.  ఈ ఘటన బుధ వారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో  చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
సంఘటన స్థలానికి చేరుకోని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు  తెలిపారు. మృతుల  వివరాలు… చాంద్ పాషా(50), సబీరా (42), ఖలీల్ (40)లుగా  గుర్తించారు. గాయ పడినవారిలో సమద్ (24) ఫహాద్ (26)లు  ఉన్నారు. ఈ దాడిలో తొమ్మిది మంది పాల్గొన్నట్లు సమాచారం.  మృతదేహాలను మార్చురీకి, గాయపడ్డ ఇద్దరిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించిన   పోలీసులు విచారిస్తున్నారు.

Leave a Reply