3.5లక్షల సీసీ కెమెరాలతో హైదరాబాద్‌ దేశంలోనే టాప్‌

0
130


హైదరాబాద్‌: హైదరాబాద్‌లో 3.5లక్షల సీసీ కెమెరాలు ఉన్నాయని.. దీంతో ప్రజాభద్రత పరంగా ఎంతో మేలు జరుగుతోందని పోలీసు ఉన్నతాదికారులు తెలిపారు. ఇటీవల ఇంగ్లాండ్‌కు చెందిన కంపారిటెక్‌ కంపెనీకి సబంధించిన రీసెర్చర్లు ప్రపంచంలో అత్యధిక సీసీ కెమెరాలతో భద్రతా పరంగా పటిష్టంగా ఉన్న నగరాలను ఎంపిక చేశారు. భారత దేశంలో హైదరాబాద్‌ ప్రథమస్థానంలో ఉందని ప్రపంచవ్యాప్తంగా 16వ స్థానంలో ఉందని గుర్తించారు. ఆ కంపెనీ నిర్వహించిన సర్వేతో పాటు గత కొన్నేళ్లుగా నగర ప్రజల్లో వచ్చిన చైతన్యం.. నేను సైతం ద్వారా అ మర్చిన కెమెరాలు ఎంతో ఫలితాలనిస్తున్నాయని హైదరాబాద్‌ సీపీ అన్నారు. సీసీ కెమెరాలతో నేరస్తులను పట్టుకోవడమే కాకుండా… నేరాలు తగ్గడానికీ అవకాశం ఉందని ఆ యన అన్నారు. దేశంలోనే సీసీ కెమెరాలు అ మర్చడంలో మన నగరం నెంబర్‌ వన్‌గా ఉండటం నగర పౌరులకు గర్వకారణం.

Leave a Reply