బాలుడి ప్రాణం బలిగొన్న సెల్ ఫోన్ వివాదం… హత్య కేసు నమోదు

0
140
Cellphone


మదనపల్లి:  సెల్‌ఫోన్ చోరీ వివాదం ఓ బాలుడి  ప్రాణాల మీదకు తెచ్చింది.  చిత్తూరు జిల్లా మదనపల్లె మండలంలో  చోటు చేసుకున్న ఈ విషాద  ఘటనకు సంబంధించిన వివరాలు  ఇలా ఉన్నాయి. కొత్త పల్లె పంచాయతీ,  ఈశ్వరమ్మకాలనీకి చెందిన బాలుడు (14)… తల్లి గతంలోనే చనిపోవడంతో  రామాపురంలో తండ్రి, నాన్నమ్మల చెంత ఉంటున్నాడు. రెండు రోజుల కిందట నాన్నమ్మ నివసించే రామాపురంలో శివయ్య అనే వ్యక్తికి చెందిన రూ.40 వేల విలువ చేసే సెల్‌ఫోన్ చోరీకి గురైంది. బాలుడిని నిలదీయగా తానే తీసుకెళ్లి మదనపల్లె మాలిక్ ఫంక్షన్‌హాలు ప్రాంతంలో ఉన్న సెల్‌ఫోన్ దుకాణ యజమాని కి రూ. 2  వేలకు అమ్మినట్లు బాలుడు ఒప్పుకున్నాడు.  శివయ్య అతని కొడుకు కలిసి  బాలున్నిసెల్ ఫోన్ షాప్ వద్దకు తీసుకెళ్లారు. తనకు సెల్‌ఫోన్ విక్రయించలేదని షాపు యజమాని చెప్పడంతో  పాటు బాలుడిపై షాపు యజమాని, సెల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తి కుమారుడు  ఆవేశంతో మూకుమ్మడిగా దాడిచేశారు. తీవ్రంగా గాయపడిన  బాలుడు అపస్మారక స్థితికి చేరుకోగా… ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతిచెందాడు.  హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply