హైదరాబాద్ లో చైన్ స్నాచింగ్

0
183
Chain

హైదరాబాద్:  పాత బస్తీ శాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని చైన్ స్నాచింగ్ జరిగింది. కాల్వగడ్డ ప్రాంతంలో అండాలు (60) అనే ఓ వృ ద్దురాలు కిరాణా షాపు నిర్వహిస్తోంది. ఆగస్ట్ 4  ఉదయం 7 గంటల సమయంలో  ఓ యువతి మరో యువకుడితో కలిసి వచ్చారు. కిరాణా  దుకాణంలో ఉన్న అండాలు మెడలో ఉన్న ఆరు తులాల బంగారు మంగళసూత్రం లాగడానికి ప్రయత్నించారు. వృద్దురాలి మెడలో నుంచి మంగళ సూత్రం తెగి అర్ధ తులం బంగారం మాత్రం వారి చేతికి చిక్కింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాల పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply