చైల్డ్‌ పోర్నోగ్రఫీ చూస్తే జైలుకే.. హైదరాబాద్‌లో ఇద్దరు యువకులు అరెస్టు

0
387
CYBER


హైదరాబాద్‌: గతేడాది చైల్డ్‌ పోర్నోగ్రఫీని సెర్చ్‌ చేసిన ఆరోపణలపై ఇద్దరు యువకులను హైదరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఇంటర్నెట్‌లో చైల్డ్‌ పోర్నోగ్రఫీ సెర్చ్‌ చేయడం, ఫోటోలు, వీడియోలు అప్‌లోడ్‌ చేయడం ప్రపంచవ్యాప్తంగా నేరమే. అలాంటి విషయాలు పట్టించుకోకుండా తప్పుదారి పడుతున్న వారిపై పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. నగరంలో అరెస్టు అయిన ఇద్దరు పోర్నోగ్రఫీ సెర్చ్‌ చేయడమే కాకుండా ఫోటోలు, వీడియోలను అప్‌లోడ్‌ చేసినట్లు కూడా వారిపై ఆరోపణలున్నాయి. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చైల్డ్‌ పోర్నోగ్రఫీ నిషేధమున్నప్పటికీ కొంతమంది అలాంటి నేరాలకు పాల్పడుతున్నారు. చైల్డ్‌ పోర్నోగ్రఫీకి సంబంధించి ఇంటర్నెట్‌లో ఎవరు సెర్చ్‌ చేసినా, ఫోటోలు, వీడియోలు అప్‌లోడ్‌ చేసినా వారి వివరాలు అన్ని నేష‌న‌ల్ క్రైం రికార్డ్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి)లో రికార్డు అవుతాయి. రికార్డుల ఆధారంగా తెలంగానలో 15మంది ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు గుర్తించిన సీఐడీ అధికారులు ఆ జాబితాను తెలంగాణ పోలీసులకు పంపించారు. వారిలో ఇద్దరు హైదరాబాద్‌కు చెందిన వారు ఉండగా మిగతా 13మంది వివిధ జిల్లాలలకు చెందిన వారు ఉండటంతో ఆయా వివరాలు జిల్లా పోలీసులకు పంపించారు. ఈ క్రమంలో 2019లో పోర్నోగ్రఫీ సెర్చ్‌ చేసిన తార్నాకకు చెందిన చెందిన మహమ్మద్‌ ఫెరోజ్‌, కాచిగూడకి చెందిన ప్రశాంత కుమార్‌లను సైబ‌ర్ క్రైం పోలీసులు గురువారం (ఆగ‌స్టు-6) అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిషేధిత చైల్డ్‌ పోర్నోగ్రఫీని సెర్చ్‌ చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని సైబర్‌క్రైం పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

Leave a Reply