చిరుత ఎక్కడ?

0
566


హైదరాబాద్:  నగర శివారు రాజేంద్రనగర్ ప్రాంతంలో చిరుతపులి ఆనవాళ్ళు కనిపించడంతో అధికారులు మరోసారి అప్రమత్తమయ్యారు.  ఆగస్టు 26 నుంచే  చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించారు.  ఆనవాళ్లు గుర్తించి 24 గంటలు గడిచినా ఇప్పటివరకూ చిరుత ఆచూకీ లభించలేదు.  దానికోసం  గాలిస్తున్న అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాజేంద్ర నగర్లో  వాలంతరి రిసెర్చ్ ఫామ్ హౌస్ లేగదూడ పై దాడి చేసి తింటున్న సమయంలో ఆవుల యజమాని శబ్దం చేయడంతో చిరుతపులి  పారిపోయింది.  అప్పటి నుంచి  గాలింపు ప్రక్రియ కొనసాగుతోంది.ఫారెస్ట్ అధికారులు చిరుతపులి జాడ కొనుక్కోడానికి 10 సీసీ కెమెరాలు ఏర్పాటు  చేశారు. సాయంత్రం సమయంలో లో అక్కడ చనిపోయిన  లేగదూడలు  తెల్లవారే సరికి మాయం  కావడంతో వాటిని
ఖచ్చితంగా చిరుతపులి తీసుకు వెళ్ళింది అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలించడానికి ఉన్నతాధికారుల వడ్డకు తరలించారు.  చిరుత
వాలంతరి ఫామ్ హౌస్ లో ఉండొచ్చు అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply