డ్యూటీకి రిపోర్టు…  అంతలోనే

0
255

!
హైదరాబాద్:  విధులు నిర్వహిస్తూ ఓ పోలీసు కానిస్టేబుల్ గుండెపోటుతో మరణించాడు.  బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లో  పి సి నెంబర్ 3564  గా పని చేస్తున్న  అంపోలు క్రాంతికుమార్{27)  పోలీస్ కానిస్టేబుల్ గా 2014లో ఎంపికయ్యాడు.  విధుల నిర్వహణలో భాగంగా  ఆగస్టు 26న  రాత్రి 8 గంటలకు గాంధీ ఆస్పత్రి వద్ద డ్యూటీకి రిపోర్ట్ చేశాడు.  విధులు నిర్వహిస్తున్న సమయంలో అకస్మాత్తుగా అతనికి గుండెపోటు రావడంతో వెంటనే  చికిత్స నిమిత్తం నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.   పరిశీలించిన డాక్టర్లు క్రాంతి కుమార్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

Leave a Reply