పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి… ఆస్పత్రి నుంచి అదృశ్యం

0
282
Covid-19


హైదరాబాద్‌: కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి కింగ్‌కోఠి ఆస్పత్రి నుంచి అదృశ్యమైన ఘటన నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన వ్యక్తి (49)కి కరోనా లక్షణాలు కనిపించడంతో ఈ నెల 1న కింగ్‌కోఠి ఆస్పత్రిలో చేరాడు. అతనికి టెస్టులు నిర్వహించగా ఈ నెల 4న పాజిటివ్‌ అని తేలింది. ఆ రోజు ఆస్పత్రి వద్ద భార్యను కల్సిన ఆ వ్యక్తి ఆమె వెళ్లి పోయిన తర్వాత లోపలికి వెళ్లకుండా అక్కడి నుంచి అదృశ్యమైనట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలో మరో రోగిని ప్రశ్నించంగా అతని భార్యను కలిసి వచ్చిన 5 నిముషాల తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిపాడు. ఆస్పత్రి నుంచి అదృశ్యమైన భర్త గురించి భార్య నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేయగా అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Leave a Reply