క్రేన్ పడి భారీ ప్రమాదం

0
314
క్రేన్
Video

విశాఖపట్నం:  విశాఖపట్నంలోని   హిందుస్థాన్  షిప్  యార్డులో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.  ఒక్కసారిగా క్రేన్ కింద పడిపోవడంతో ఈ ఘటన జరిగింది.  క్రేన్ ను చెక్ చేస్తున్న సమయంలో  ఈ దుర్ఘటన చోటు చేసుకోవడంతో చెక్  చేస్తున్న వారిలో  పలువురు   క్రేన్ కింద  చిక్కుకున్నట్లు
సమాచారం. అప్రమత్తమైన యంత్రాంగం  సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. హిందూస్తాన్‌ షిప్ ‌యార్డులో చోటు చేసుకున్న ఘోర ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం. క్రేన్‌ ద్వారా లోడింగ్‌ పనులు పరిశీలిస్తుండగా క్రేన్‌ కుప్పకూలిపోవడంతో ఆరుగురు కార్మికులు మృతి చెందారు. మిగిలిన వారి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద ఘటనపై విచారిస్తున్నారు.

Leave a Reply