సీసీ కెమెరాలో చిక్కితేనే ప‌ట్టుకుంటారా..?

0
344

దీక్షిత్ రెడ్డి సంఘ‌ట‌న‌తో పోలీసుల విచార‌ణ లోటుపాట్లు బ‌హిర్గ‌తం

తెలంగాణ పోలీసు అంటే హైటెక్ పోలీసు అని ప్ర‌భుత్వం గొప్ప‌గా చెప్ప‌కుంటుంది. కానీ.. ఇక్క‌డ చిన్న అనుమానం..? హైటెక్ పోలీసు అని తెలంగాణ పోలీసుల‌ను అనాలా..? ‌లేక హైద‌రాబాద్ పోలీసుల‌ను మాత్ర‌మే అనాలా..? మ‌హ‌బూబాబాద్ కిడ్నాప్ కేసు విషాధం అయ్యాక‌ ఈ అనుమానం క‌లుగుతోంది. అక్క‌డ జ‌రిగిన నేరం హైద‌రాబాద్, సైబ‌రాబాద్, రాచ‌కొండ పోలీసు క‌మిష‌న‌రేట్ల ప‌రిధిలో జ‌రిగితే పోలీసులు ఇలాంటి కేసుల‌ను గంట‌ల్లోనే చేదించేవారు. వాస్త‌వానికి ఇక్క‌డ పోలీసులు పెద్ద‌గా క‌ష్ట‌ప‌డేది కూడా ఉండ‌దు. వారి విచార‌ణ అంతా న‌గ‌రంలో బిగించిన ల‌క్ష‌లాది సీసీ కెమెరాలు చేసేస్తున్నాయి. అలాగే మొబైల్ ఫోన్ ఉండ‌నే ఉంది. దాని ఆధారంగా ప‌ట్టేస్తున్నారు. మ‌రి ఇవి లేనిచోట ఎలా..? మ‌హ‌బూబాబాద్ ఘ‌ట‌న‌లో నిందితుడిని గుర్తించేందుకు నాలుగు రోజులు ప‌ట్ట‌డం వెన‌క ప్ర‌ధాన కార‌ణం క్లూస్ (ఆధారాలు) దొర‌క‌పోవ‌డం అని అక్క‌డి పోలీసులు స్వ‌యంగా ప్ర‌క‌టించ‌డం విచార‌ణ‌లో వారి లోటుపాట్ల‌ను బ‌హిర్గ‌తం చేస్తోంది. నిందితులెవ‌రు పోలీసుల‌కోసం ఆధారాలు వ‌ద‌ల‌రు. పోలీసుల‌కు చిక్క‌మ‌న్న ధైర్యంతోనే నేరాల‌కు పాల్ప‌డుతారన్న‌ది పోలీసుల‌కు తెలియ‌ని విష‌య‌మా..? అలాంటి వారిని ప‌ట్టుకునేందుకే క‌దా పోలీసు వ్య‌వ‌స్థ ఏర్పాటు చేసింది. దీక్షిత్ రెడ్డి హ‌త్య ఉదంతం అనంత‌రం జిల్లా స్థాయిల్లో పోలీసుల విచార‌ణ లోటుపాట్ల‌ను ఎత్తి చూపింది.

సాంకేతిక ప‌రిజ్ఞానంపైనే పోలీసుల ఆశ‌లు

హైటెక్ పోలీసుల‌ని పేరున్న‌ద‌ని కాబోలు.. రాష్ట్రంలో పోలీసుల విచార‌ణ తీరు చూస్తుంటే పూర్తిగా సాంకేతిక ప‌రిజ్ఞానంపైనే ఆధార‌ప‌డుతున్నారు అనిపిస్తోంది. ఏదైనా నేరం జ‌రిగితే నిందితుడు సీసీ కెమెరాలో ఎక్క‌డ చిక్కాడో వెతుకుతున్నారు. లేదా అత‌డి ఫోన్ నెంబ‌రు సిగ్న‌ల్ ఆధారంగా క‌ద‌లిక‌ల‌ను గుర్తిస్తున్నారు. రాష్ట్రంలో ఏ నేరం జ‌రిగినా పోలీసులు దృష్టి పెట్టేది ఈ రెండు అంశాల‌పైనే. ఎక్క‌వు శాతం కేసులు ఇక్క‌డే చేదించ‌గ‌లుగుతున్నారు. ఇవి రెండు లేని సంద‌ర్భాల్లో కేసులు వారాలు, నెల‌లు, ఏళ్ల త‌ర‌బ‌డి పెండింగులో ఉంటున్నాయి. ముఖ్యంగా హైద‌రాబాద్ త‌ర‌హాలో జిల్లాల్లో సీసీ కెమెరాలు ఎక్క‌డ‌బ‌డితే అక్క‌డ‌ ఉండ‌వు కాబ‌ట్టి విచార‌ణ విజ‌యవంతం కావ‌ట్లేద‌ని పోలీసు వ‌ర్గాలు అంటున్నాయి.
దీక్షిత్ రెడ్డి కేసు క‌నీసం నాలుగు రోజుల్లో అయినా తేలిందంటే అక్క‌డి క‌లెక్ట‌రేట్ ఎదుట సీసీ కెమెరాలో నిందితుడు చిక్క‌డ‌మే. లేదంటే ఇంకా ఎన్నాళ్లు ప‌ట్టేదో..? అస‌లు సీసీ కెమెరాల్లో చిక్క‌కుంటే, ఫోన్ వివ‌రాలు లేకుంటే ఎలా ప‌ట్టుకోవాల‌న్న విష‌యంపై పోలీసుల‌కు తెలిసిన విద్య ఒక్క‌టే నుమానితుల‌ను తెచ్చి వారిదైన శైలిలో విచారించ‌డ‌మే. అక్క‌డా విఫ‌ల‌మైతే ఇక ఆ కేసు కంచికేనా..? కేసులు సుల‌భంగా చేదించేందుకు సాంకేతిక ప‌రిజ్ఞానం వినియోగిస్తున్న పోలీసులు.. అది అందుబాటులో లేకుంటే కేసులు ప‌రిష్క‌రించ‌లేక‌పోతున్నార‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

Leave a Reply