ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

0
258

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టు పిస్ పరిదిలోని జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో  ఆశయ్య అనే కానిస్టేబుల్ ప్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను చేవెళ్ల ఎక్సైజ్ కార్యాలయంలో కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆర్థిక పరిస్థితులా లేక ఇతరత్రా  అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇతని స్వగ్రామం వికారాబాద్ జిల్లా ఎన్నికతల గ్రామం. శనివారం ఉదయం 10 గంటలకు డ్యూటీ కోసం శంషాబాద్ ఎక్సైజ్ కార్యాలయానికి  వచ్చాడు.
24 గంటలు డ్యూటీ అయిపోవడంతో రిలీవర్ గణేష్ వచ్చి చూడగా ఫ్యాన్కు ఉరి వేసుకుని ఉన్నాడు. ఇదే విషయమై ఉన్నతాధికారులకు తెలియజేయడంతో శంషాబాద్ పోలీసులు వచ్చి ఘటనా స్థలంలో ఉన్న ఆధారాలను పరిశీలిస్తున్నారు.

Leave a Reply