ప్రపంచంలోనే రెండోసారి కరోనా సోకిన మొదటి వ్యక్తి

0
267

కరోనా సోకిన వ్యక్తులు కోలుకుని నెగెటివ్ వచ్చాక… మరోసారి వ్యాధి బారిన పడే అవకాశాలు తక్కువని ఇప్పటివరకు చాలా మంది భావిస్తూ వచ్చారు. కానీ అది తప్పని నిరూపించే కేసు హాంకాంగ్ లో వెలుగు చూసింది. యూరప్ నుంచి హాంకాంగ్ తిరిగి వస్తున్న 33 ఏళ్ల వ్యక్తికి రెండోసారి సార్స్ కోవ్ -2 సోకిందని విమానాశ్రయంలో జరిపిన స్క్రీనింగ్ లో తేలింది.
అతడికి మొదటిసారి గత ఏప్రిల్ నెలలో పాజిటివ్ రాగా కోలుకున్నాడు. ఇప్పుడు మళ్లీ రెండోసారి వ్యాధి అతడిని తాకింది. దీన్ని బట్టి కొన్ని నెలల వ్యవధిలోనే ఇన్ఫెక్షన్ రెండోసారి రావచ్చని అర్థమవుతోంది. బాధితుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగ ఉద్యోగి. అతడిలో ఎలాంటి వ్యాధి లక్షణాలూ కనిపించకపోవడం గమనార్హం. యూనివర్శిటీ ఆఫ్ హాంకాంగ్ పరిశోధకులు అతడిలోని వైరస్ జన్యుక్రమాన్ని పరిశీలిస్తున్నారు. రెండుసార్లు వచ్చిన వైరస్ స్ర్టెయిన్స్ వేర్వేరు కావచ్చని వారు అంచనా వేస్తున్నారు. ‘రెండుసార్లు కొవిడ్ -19 బారిన పడిన కేసు ప్రపంచంలో ఇదే మొదటిది’ అని పరిశోధకులు వెల్లడించారు. అయితే రెండోసారి వైరస్ సోకడానికి ఎన్నాళ్లు పట్టవచ్చు, అలా సోకిన వారి నుంచి కూడా అది ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశం ఉందా అనే కోణంలో విశ్లేషణలు కొనసాగుతున్నాయి.

Leave a Reply