9 ఏళ్లుగా యువతిపై143 మంది…

0
517

హైదరాబాద్:  రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన యువతిపై సామూహిక అత్యాచారం ఘటనపై నిరసనలు ప్రారంభమయ్యాయి. గత తొమ్మిదేళ్లుగా….  ఓ యువతిని శారీరికంగా, మానసికంగా హింసించి సమాజం సిగ్గుపడేలా అత్యాచారం చేసిన దుండగులను అరెస్ట్ చేయాలని   విద్యార్థి సంఘాల నాయకులు,  కార్యకర్తలు డిమాండ్ చేశారు.  అమ్మాయికి రక్షణ కల్పించి,ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి తెరవెనుక ఉన్న కీచకులందరిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ  పోలీస్ కమిషనర్ కార్యాలయం ముందు  నిరసనలు వ్యక్తం చేశారు.  ఇదే ఘటనకు సంబంధించి పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీనిపై లోతైన దర్యాప్తు నిమిత్తం కేసును ఉన్నతాధికారుల సూచనలు, అనుమతి మేరకు  కేసును  సి సి ఎస్ కు బదిలీ చేశారు. 143 మంది తనపై కొన్ని సంవత్సరాలుగా లైంగిక దాడికి పాల్పడడమే కాకుండా శారీరకంగా హింసించారని, ఎవరికైనా చెబితే తుపాకీతో కాలుస్తామని బెదిరించారని, ఆ యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనతో నగ్నంగా నృత్యాలు చేయించడమే కాకుండా వీడియోలు తీశారని, పలుమార్లు అబార్షన్ కూడా చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విద్యార్థి సంఘాల నాయకులు, రాజకీయ నాయకుల పీఏలతోపాటు సినీ పరిశ్రమ, పలు రంగాలకు చెందిన వారు  నిందితులుగా ఉన్నారు.  అందుకోసం లోతైన విచారణకు సీసీఎస్ కు అప్పగించారు.

Leave a Reply