ఆ రెండు కార్లలో ఏముందంటే….

0
274
Ganjai seized

భద్రాచలం:  భద్రాచలం  ఫారెస్ట్ చెక్ పోస్ట్  వద్ద  అధికారులు మరోసారి భారీ ఎత్తున గంజాయి పట్టుకున్నారు.  భద్రాచలం ఏఎస్పీ రాజేష్  చంద్ర ఐపిఎస్ తెలిపిన వివరాల ప్రకారం..  ఆగస్టు 6 ఉదయం 7 గంటల సమయంలో ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద భద్రాచలం టౌన్ ఎస్ఐ మహేష్ టౌన్ సిబ్బంది మరియు సీఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు  చేపట్టారు.  అదే సమయంలో నిషేధిత గంజాయి  లోడుతో వెళ్తున్న రెండు వాహనాలపై  అధికారులు  అనుమానం వ్యక్తం చేస్తూ తనిఖీ చేయగా…. 
AP 29 TV 1856 అనే మహేంద్ర వెరిటో  వాహనంలో ఉన్న రాథోడ్  ప్రేమ్ అనే వ్యక్తిని  విచారించారు.  అందులో 255.6 కిలోల గంజాయిని  స్వాధీనం చేసుకున్నారు.  అనంతరం AP 28 BD 1111 హుందాయ్ ఎలాంట్రా  వాహనంలో ఉన్న చవాన్  రమేష్ వాహనం లోంచి 162.5 కిలోల గంజాయిని  స్వాధీనం చేసుకున్నారు.  విచారణలో గంజాయిని మల్కనగిరి నుండి హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు  ఒప్పుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని వాహనాలతో పాటు గంజాయిని స్వాధీనపరచుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు  పంపించారు. స్వాధీనపరుచుకున్న గంజాయి విలువ 62 లక్షల 73 వేల రూపాయలు  ఉన్నట్లు అధికారులు వివరించారు.
రెండు వారాల్లో 2 కోట్ల  గంజాయి
గడిచిన 45 రోజుల్లో భద్రాచలం పట్టణ పోలీసులు 14 గంజాయి కేసులు నమోదు చేసి సుమారు 2 కోట్ల విలువ చేసే రెండు వేల కేజీల గంజాయిని స్వాధీనపర్చుకున్నారు. భద్రాచలం పట్టణంలో 24 గంటలు  నిరంతరం చెక్ పోస్ట్ పెట్టి వాహనాలు తనిఖీ నిర్వహించి గంజాయి మరియు ఇతర నిషేధిత సామాగ్రి రవాణా కాకుండా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుంది. ప్రజలు కూడా తమకు  సహకరించాలని అధికారులు కోరుతున్నారు. గంజాయి సమాచారం ఉంటే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని తెలిపారు.

Leave a Reply