వందే భార‌త్ విమానాల్లో బంగారం స్మ‌గ్లింగ్

0
169

లో దుస్తుల్లో దొరికిన 3.11 కేజీల బంగారం

Gold smuggling

హైదరాబాద్: విదేశాల్లో చిక్కుకున్న భార‌తీయుల‌ను ర‌ప్పించాల‌న్న ల‌క్ష్యంతో కేంద్ర‌ప్ర‌భుత్వం వందేభార‌త్ పేరుతో ప్ర‌త్యేక విమానాలు న‌డుపుతుండ‌గా.. దీనినీ అక్ర‌మ ఆదాయ ఆర్జ‌న‌కు ఉప‌యోగించుకుంటున్నారు కొంద‌రు. వందే భారత్ మిషన్ విమానాల్లో వస్తున్న ప్రయాణికులను  తనిఖీ చేయగా వారి వద్ద అక్రమంగా తరలిస్తున్న బంగారం గుర్తించారు.  ప్రయాణికుల రూపంలో కొంత మంది బంగారం స్మగ్లింగ్  చేస్తున్నారనే సమాచారంతో  అధికారులు అప్రమత్తమయ్యారు. దామన్ నుంచి వస్తున్న  ప్రయాణికులను  తనిఖీ చేయగా వారిలో పదకొండు మంది ప్రయాణికులు బంగారం స్మగ్లింగ్  చేస్తున్నట్టు  అధికారులు గుర్తించారు.  ఆయా ప్రయాణికులు లో దుస్తుల్లో పెట్టుకొని బంగారం తీసుకొని వస్తున్నట్లు పరిశీలనలో వెల్లడైంది.  11 మంది  ప్రయాణికుల వద్ద నుంచి  3.11 కిలోల బంగారాన్ని  కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  బంగారం విలువ కోటి అరవై ఆరు లక్షల రూపాయలు  ఉంటుందని అధికారులు తెలిపారు. అక్రమంగా తరలించిన బంగారం స్వాధీనం చేసుకున్న అధికారులు  విచారణ కొనసాగిస్తున్నారు.

Leave a Reply