బండారు దత్తాత్రేయకు తృటిలో తప్పిన ప్రమాదం

1
362

నల్గొండ: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయకు త్రుటిలో ప్రమాదం తప్పింది. నల్లగొండలో తనకు జరిగే పౌర సన్మానం కార్యక్రమం లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుండి నల్లగొండ కు వెళ్తుండగా చౌటుప్పల్ మండలం ఖైతాపురం గ్రామ శివారులో జాతీయ రహదారిపై దత్తాత్రేయ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు కిందికి దూసుకెళ్లింది. ఆయన ప్రయాణిస్తున్న కారు స్టీరింగ్ బిగుసుకు పోవడంతో రోడ్డు పక్కకు కారు దూసుకు పోయినట్లు సమాచారం. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడం తో భారీ ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు అవలేదు… కొద్దిసేపటి తర్వాత మరో వాహనంలో గవర్నర్ దత్తాత్రేయ నల్గొండ బయలుదేరారు. ప్రమాద సమయంలో కారులో దత్తాత్రేయ, వ్యక్తిగత సహాయకుడు, డ్రైవర్ ఉన్నారు. ఈ ముగ్గురూ సురక్షితంగా బయటపడ్డారు.

1 COMMENT

Leave a Reply