పుట్టిన రోజు వేడుకలో విషాదం

0
113


హైదరాబాద్: బేగం పేటలో స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలో
పాల్గొన్న ఓ హోంగార్డు కొద్ది సేపటికే వాంతులు చేసు
కుంటూ కిందపడి మృతి చెందిన ఘటన జరిగింది. బేగంపేట పోలీసుల కథనం ప్రకారం..
ఫతేనగర్‌కు చెందిన హోంగార్డు బోయ ఆనంద్ (34)
డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. డిసెంబర్28న
రాత్రి 11.30 సమయంలో రసూల్‌పురలోని
వల్లబాయ్ పటేల్ కమ్యూనిటీ హాల్లో జరిగిన
పుట్టిన రోజు వేడుకలో పాల్గొన్నాడు. భోజనం చేసి
కుర్చీపై కూర్చొన్న తర్వాత వాంతులు చేసు
కుంటూ, ఒక్కసారిగా కిందపడిపోయాడు. పక్కన
ఉన్న వారు అతడిని పైకి లేపేందుకు యత్నించగా,
అప్పటికే స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే 108కు
ఫోన్ చేయగా, వారు వచ్చి అప్పటికే చనిపోయాడని
తెలిపారు. అయితే బోయ ఆనంద్ మృతిపై అనుమా
నాలు కూడా ఉన్నాయని, దర్యాప్తు చేయాలని మృతుడి
తండ్రి రిటైర్డ్ ఎస్ఎ శివప్ప 29న బేగం
పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Leave a Reply