అమెరికాలో రోడ్డు ప్రమాదం హైదరాబాద్ యువకుడి మృతి

0
211


చికాగో:  విద్య, ఉపాధి నిమిత్తం అమెరికాకు వెళ్లి అక్కడ స్థిరపడ్డ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.  పాతబస్తీ కార్వాన్ ప్రాంతానికి చెందిన మొయిజుద్దీన్ (31)… 2015లో  విద్యార్థి వీసా పై అమెరికా వెళ్ళాడు.  ఐదేళ్లుగా అక్కడే ఉంటూ చదువు కొనసాగించడంతో పాటు  క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తూ ఉపాధి పొందుతున్నాడు.  భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో చికాగోలోని ఇల్లినాయిస్ స్టేట్లో  టబ్ కారులో వెళుతుండగా  ప్రమాదానికి గురయ్యాడు.  సంఘటనా స్థలంలో మొయిజుద్దీన్ మృతిచెందినట్లు  అక్కడి పోలీసులు ధృవీకరించారు.  చివరిసారిగా 2019  సెప్టెంబర్ లో అతను నగరానికి వచ్చి పెళ్లి చేసుకున్నాడు.  అతనికి నెలల బాబు ఉన్నాడు.  ప్రస్తుతం భార్య, బాబు  అమెరికాలోనే ఉన్నారు.  మృతదేహాన్ని హైదరాబాద్ కు తరలించాలని కుటుంబీకులు విదేశాంగ శాఖను కోరారు.

Leave a Reply