రోడ్డెక్కిన వివాహేతర బంధం

0
246

నెల్లూరు :  ఓ మహిళతో వైద్యుడు పెట్టుకున్న వివాహేతర సంబంధం బెడిసి రోడ్డుపై కొట్టుకునేంత వరకు వెళ్ళింది. నెల్లూరులో బహిర్గతమైన వివాహేతర సంబంధం స్థానికులకు ఆశ్చర్యం లో ముంచెత్తింది.
ఓ మహిళ, మరో డాక్టర్ అందరూ చూస్తుండగానే ఒకరినొకరు కొట్టుకున్నారు. చివరికి బాధితురాలు జిల్లా ఎస్పీని ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం మేరకు…. కొన్నాళ్లుగా నెల్లూరుకు చెందిన హోమియోపతి డాక్టర్‌ బాల కోటేశ్వరరావుకు, స్థానిక మహిళతో వివాహేతర సంబంధం కొనసాగుతుంది. అయితే కొంతకాలంగా డాక్టర్‌ ఆ మహిళను దూరం పెడుతున్నాడు. దీంతో ఆగ్రహించిన మహిళ నేరుగా డాక్టర్‌ పనిచేసే చోటికెళ్లి నిలదీసింది. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఘర్షణ తీవ్రతరమై సదరు మహిళ కోటేశ్వరరావును చొక్కా పట్టుకుని బయటకు లాక్కొచ్చింది. బయట అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఇద్దరూ కొట్టుకున్నారు. అనంతరం బాధిత మహిళ జిల్లా ఎస్పీ విజయ రావును ఆశ్రయించి న్యాయం చేయాలని వేడుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply