శానిటైజర్ ఘటనలో 20 కు చేరిన మృతులు

0
121

ప్రకాశం : శానిటైజర్‌ తాగి ప్రకాశం జిల్లాలో ఆదివారం మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వారం వ్యవధిలో జిల్లాలో శానిటైజర్‌ మృతుల సంఖ్య 20కి చేరింది. కురిచేడులో శనివారం వరకూ 15 మంది మృతి చెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాకాని గురవయ్య(45) అనే రిక్షా కార్మికుడు ఆదివారం కన్నుమూశాడు. ఒంగోలు.. నెహ్రూనగర్‌లో దుర్గాప్రసాద్‌(35) కూడా శానిటైజర్‌ తాగి మృతి చెందాడు. దీంతో ఒక్క కురిచేడు ఘటనలోనే 17 మంది మృత్యువాత పడ్డారు.. కురిచేడుకు చెందిన సుమారు 40 మంది బాధితులు ఒంగోలు రిమ్స్‌లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

Leave a Reply