మాస్కులు ధరించకుంటే కేసులు

0
708
Mask Must


హైదరాబాద్‌: కరోనా వైరస్‌తో సాగుతున్న పోరులో ప్రతి వ్యక్తి బాధ్యతాయుతంగా మెలగాలని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ పిలుపునిచ్చారు. వైరస్‌ వ్యాప్తి విపరీతంగా పెరుగుతున్న సంక్షోభ సమయంలో బాధ్యతారాహిత్యం సహించరానిదన్నారు. అ వగాహన కల్పించినా… ఎన్ని జాగ్త్రతలు తీసుకుంటున్నా ఇప్పటికీ కొంతమంది కనీస జాగ్రత్తగా మాస్కులు ధరించకపోవడం విచారకరమన్నారు. పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ… మాస్కు ధరించకపోవడంతో వాటిల్లే నష్టాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. బుధవారం ఒక్క రోజే (29 జూ లై) మాస్కులు ధరించని 2275 మందిపై కేసులు నమోదు చేశారు. ఇంటి నుంచి బయట అడుగుపెడుతున్న ప్రతి సారి మాస్కు తప్పనిసరిగా ధరించాలని సీపీ కోరారు.

Leave a Reply