అర్ధరాత్రి అరాచకం..

0
143

నిజామాబాద్: దేశంలో అత్యాచారాల పర్వం కొనసాగుతోంది. శిక్షలంటే భయం లేదు.. చట్టాలంటే లెక్కలేదు. మృగాలు రెచ్చిపోతూనే ఉన్నారు. ఆడవారిపై అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. నిత్యం ఏదో ఒక చోట ఈ ఘోరాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా…. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. కలెక్టరేట్‌కు కూత వేటు దూరంలోనే ఒంటరి మహిళపై అత్యాచారం జరిగింది. కొంతమంది మంది యవకులు సామూహిక అత్యాచారం చేశారు. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు చెప్పిన కథనం ప్రకారం.. ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ 2 రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడింది. ఆమెను తన సోదరి నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించింది…ఓ పని నిమిత్తం సోమవారం రాత్రి రైల్వే స్టేషన్ సమీపంలోకి వెళ్లింది. అక్కడ ఒంటరిగా ఉన్న మహిళను విక్కీ అనే యువకుడు చూసి మాట కలిపాడు. ఐతే డబ్బులు అవసరం ఉందని చెప్పడంతో తాను ఇస్తానని నమ్మించాడు. కలెక్టరేట్ వద్ద ధర్నా చౌక్ ప్రాతానికి రమ్మని తీసుకెళ్లి.. అక్కడ ఓ పాడుబడ్డ గదిలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత విక్కీ అతని కొంతమంది స్నేహితులు కూడా వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అదే సమయంలో రోడ్డుపై పోలీసుల పెట్రోలింగ్ వాహనాన్ని చూసి పరారయ్యారు. ఏదో జరిగిందని భావించిన పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి చూస్తే.. బాధిత మహిళ అచేతనంగా పడి ఉంది. ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply