ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బంధువు అనుమానాస్పద మృతి

0
367

నల్లగొండ: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బాబాయ్ కుమారుడు డాక్టర్ జై షీల్ రెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందాడు. జిల్లా కేంద్రం పరిధిలోని మేళ్ల దుప్పలపల్లి గ్రామంలో ఉన్న వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన జై షీల్ రెడ్డి(42) సోమవారం అదృశ్యమయ్యాడు. సమీపంలోని వాగు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయడా, లేక బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడా అనేది మిస్టరీగా మారింది. ఇష్టం లేకున్నా జై షీల్ రెడ్డిని కుటుంబ సభ్యులు అమెరికాకి వెళ్లాలని ఒత్తిడి చేసినట్లు తెలిసింది. వ్యవసాయ క్షేత్రంలో కుంట అలుగు పోస్తున్న దృశ్యాలను తన మామ వినోద్ రెడ్డికి వాట్సాప్ కూడా చేశాడు. ఆ తర్వాత మామ వినోద్ రెడ్డి తిరిగి జై షీల్ రెడ్డికి ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ఆఫ్ వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు మంగళవారం వెతకగా సమీప చెరువులోనే జై షీల్ రెడ్డి మృతదేహం లభించింది. ఈ ఘటనపై పోలీలసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply