కుటుంబ కలహాలు: ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య

0
209

హైదరాబాద్: జవహర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం రాత్రి నాగమణి అనే వివాహిత తన ఐదేళ్ల కుమార్తె మార్వెల్ రూబీ, 8 నెలల కూతురితో కలిసి చెన్నపురం చెరువులో దూకింది. క్రిస్మస్‌కు పుట్టింటికి వెళ్తానని నాగమణి భర్తను అడిగింది. పండుగ తర్వాత వెళ్దువుగాని అని అతడు భార్యకు చెప్పాడు. ఈ విషయంలో భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో నాగమణి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయింది. రాత్రి అయినా వాళ్లు ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు జవహర్‌ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తుండగా చెన్నపురం చెరువులో మూడు మృతదేహాలు ఉన్నట్లు స్థానికుల ద్వారా వారికి సమాచారం అందింది. ఇవాళ ఉదయం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికి తీశారు. వీళ్ల మృతికి కుటుంబ కలహాలే కారణమా.. మరేదైనా ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే సంఘటనా స్థలికి చేరుకున్న క్లూస్ టీం ఆధారాలు సేకరించింది.

Leave a Reply