బ‌తుకు, చావూ పిల్ల‌ల కోస‌మే.. వృద్ధ దంపతుల విషాదాంతం

0
339


హైద‌రాబాద్: పిల్ల‌లు పుట్టిన‌ప్ప‌టి నుంచి ప్ర‌యోజ‌కులు అయ్యేంత‌వ‌ర‌కు త‌ల్లిదండ్రుల ధ్యాస అంతా వారి బాగు గురించే. వారి సంతోషం కోసం జీవితాంతం క‌ష్ట‌ప‌డుతారు. పిల్ల‌లు, మ‌న‌వ‌ళ్ల‌ను చూసుకుంటూ జీవిత చ‌ర‌మాంకంలో సంతోషంగా ఉందామ‌నుకుంటారు. హైద‌రాబాద్ లోని ఈ దంప‌తులు మాత్రం వృద్దాప్యంలోనూ క‌న్న‌పేగు గురించే ఆలోచించారు. త‌మ కార‌ణంగా వారు ఇబ్బందులు ప‌డ‌వ‌ద్ద‌ని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డి ఈ లోకం నుంచి చాలించారు. త‌ల్లిదండ్రుల ప్రేమ‌, త‌మ పిల్ల‌ల కోసం వారు ఎంత‌టి త్యాగాలు చేయ‌గ‌ల‌రో చాటిచెప్పే ఘ‌ట‌న ఇది. క‌న్నీళ్ల‌ను తెప్పించే సంఘ‌ట‌న ఇది.

ఖైరతాబాద్ లోని రాజనగర్ లో నివాసముంటున్న వృద్ద దంపతులు వెంకటేశ్వర నాయుడు, వెంకటమ్మ10 రోజులుగా జ్వరంతో బాధ పడుతున్నారు. మందులు వాడుతున్నా జ్వ‌రం ఎంత‌కూ త‌గ్గ‌క‌పోవ‌డంతో క‌రోనా అన్న అనుమానం వారిలో పెరిగింది. త‌మ కార‌ణంగా పిల్ల‌లు, మ‌న‌వ‌ళ్ల‌కు కూడా ఎక్క‌డ సోకుతుందో అన్న బెంగ వారిని మ‌రింత‌గా కుంగ‌దీసింది. శ‌నివారం ఉద‌యం వారు కూల్ డ్రింక్లో పురుగుల మందు క‌లుపుకుని తాగి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. మృతులు రాసిన ఓ సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమకు కరోనా వచ్చిందేమో… తమ వల్ల పిల్లలకు సోక కూడదని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆ లేఖలో ఉంది. ఈ విష‌యం తెలుసుకుని స్థానికుల‌తో పాటు పోలీసులు సైతం క‌న్నీళ్ల‌ను ఆపుకోలేక‌పోయారు.

Leave a Reply