వెబ్ సైట్లో ఫోటో.. గూగుల్ పే లో పేమెంట్.. కోరుకున్న చోటికి అమ్మాయి

0
146

ఆన్ లైన్

హైదరాబాద్: అన్ లైన్లో వ్యభిచార దందా నిర్వహిస్తున్న ముఠాను తెలంగాణ రాచకొండ పోలీసులు డెకాయ్ ఆపరేషన్  ద్వారా పట్టుకున్నారు. నిర్వాహకుల్లో  కీలక వ్యక్తి ని  అరెస్ట్ చేయడమేగాక పశ్చిమ్  బెంగాల్,  కోల్‌కతాకు చెందిన నలుగురు యువతులకు విముక్తి కల్పించారు . పరారీలో ఉన్న  ప్రధాన నిర్వాహకురాలు, ఆమె సహాయకుడి కోసం గాలిస్తున్నారు.
ఇదీ  దందా..
గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన   ఓ వ్యక్తితో విజయవాడకు చెందిన  మహిళ,  మరో వ్యక్తి కలిసి ముఠాగా ఏర్పడ్డారు. అంతకుముందే వీరికి వివిధ రాష్ట్రాల్లో యువతులను సరఫరా చేసే దళారులతో పరిచయముంది. వారి సహకారంతో కొంత డబ్బు చెల్లించి పశ్చిమ  బెంగాల్, కోల్‌కతాకు చెందిన నలుగురు యువతులను నగరానికి తీసు కొచ్చి బల్కంపేటలోని అద్దె ఇంట్లో ఉంచారు. సామాజిక మాధ్యమాలు, లొకాంటో తదితర వెబ్ సైట్లలో ఈ నలుగురి ఫొటోలను ఉంచి విటులను ఆకర్షిస్తున్నారు.
నమ్మకం  మీదే అంతా..
ఈ వ్యవహారమంతా ఆన్ లైన్ లోనే జరుగుతోంది . విటుల నుంచి ఫోన్ రాగానే నిర్వాహ కులు అప్రమత్తమవు తారు. మీకు ఈ నంబర్ ఎక్కడి నుంచి వచ్చిందంటూ తీసి మళ్లీ ఫోన్ చేస్తా మంటూ కట్ చేస్తారు.  ట్రూ కాలర్, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో పరిశీలించి ఎలాంటి ఇబ్బంది ఉండదని నమ్మకం కుదిరాక ఆ నంబరు తిరిగి ఫోన్ చేస్తారు. గూగుల్ పే , ఫోన్ పే , పేటీఎం ద్వారా ముందుగా కొంత మొత్తం కట్టించుకుంటారు . చెల్లించిన మరుసటి రోజు లేదా విటులు కోరుకున్న సమయంలో యువతులను తీసుకెళ్తారు. విశ్వసనీయ వర్గాల సమాచారంతో మల్కాజిగిరి ఎస్ ఓ టీ ఇన్ స్పెక్టర్ నవీన్ కుమార్ , కీసర ఇన్ స్పెక్టర్ నరేందర్ ఆధ్వర్యంలో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు . నిర్వాహకులను మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లికి రప్పించి  ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలిసి  మిగతా ఇద్దరు పరారయ్యారు.  నలుగురు యువతులను రక్షించారు. నాలుగు సెల్ ఫోన్లను సీజ్ చేసినట్లు  పోలీసులు వెల్లడించారు.

Leave a Reply